రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత మహిళా అథ్లెట్ లలితా బాబర్ మెరిసింది.
రియో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత మహిళా అథ్లెట్ లలితా బాబర్ మెరిసింది. రియోలో శనివారం సాయంత్రం జరిగిన మహిళల 3000మీటర్ల స్టీపుల్ ఛేజ్ హీట్స్ లో రాణించి ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం గమనార్హం. అయితే మరో భారత అథ్లెట్ సుధాసింగ్ మాత్రం ఫైనల్ చేరడంతో విఫలమైంది. ఫైనల్లోనూ లలితా బాబర్ రాణిస్తే భారత్ కు పతకం దక్కుతుంది.