భారత్‌ శుభారంభం | Indian women's Hockey team defeat South Korea 2-1 | Sakshi
Sakshi News home page

భారత్‌ శుభారంభం

May 21 2019 12:38 AM | Updated on May 21 2019 12:38 AM

Indian women's Hockey team defeat South Korea 2-1 - Sakshi

జించియోన్‌: దక్షిణ కొరియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 2–1తో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున లాల్‌రెమ్‌సియామి (20వ ని.), నవనీత్‌ కౌర్‌ (40వ ని.) చెరో గోల్‌ చేశారు. కొరియా తరఫున షిన్‌ హ్యెజియాంగ్‌ (48వ ని.) గోల్‌ సాధించింది.

ఆతిథ్య కొరియాకు పదే పదే పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు దక్కినా... భారత గోల్‌కీపర్‌ సవిత గోల్‌పోస్ట్‌ ముందు గోడలా నిలబడింది. ఐదు పీసీ లను, ఒక పెనాల్టీ స్ట్రోక్‌ను సమర్థంగా అడ్డుకుంది. రెండో మ్యాచ్‌ బుధవారం జరుగుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement