జపాన్ చేతిలో భారత్ ఓటమి

యోగ్‌యకార్తా (ఇండోనేసియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్రపంచ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో భారత పురుషుల జట్టు 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–4, 11–7, 12–10తో హరిమోటో తొమోకాజు (జపాన్)పై గెలిచి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. అయితే రెండో మ్యాచ్‌లో ఆచంట శరత్ కమల్ 8–11, 12–10, 5–11, 12–14తో మహరు యోషిమురా చేతిలో... మూడో మ్యాచ్‌లో హరీ్మత్ దేశాయ్ 7–11, 11–6, 6–11, 2–11తో జిన్ టకుయ చేతిలో... నాలుగో మ్యాచ్‌లో శరత్ కమల్ 7–11, 0–11, 0–11తో హరిమోటో చేతిలో ఓడిపోవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. భారత్ ఇక 5 నుంచి 8 స్థానాల కోసం పోటీపడుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి