పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం | Indian men's kabaddi team wins gold medal in the asian games | Sakshi
Sakshi News home page

పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం

Oct 3 2014 10:29 AM | Updated on Sep 2 2017 2:20 PM

పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం

పురుషుల కబడ్డీలో భారత్కు స్వర్ణం

ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల కబడ్డీ జట్టు 'పసిడి' పతకం సొంతం చేసుకుంది.

ఇంచియాన్ : ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. పురుషుల కబడ్డీ జట్టు 'పసిడి' పతకం సొంతం చేసుకుంది. ఫైనల్స్లో ఇరాన్పై 27-25 తేడాతో భారత్ జట్టు గెలుపొందింది.  ఇక ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీ జట్టు వరుసగా ఏడోసారి స్వర్ణం సాధించటం విశేషం. దాంతో ఆసియా క్రీడల్లో భారత్కు ఇది 11వ స్వర్ణం. మరోవైపు శుక్రవారం జరిగిన మహిళల కబడ్డీ జట్టు కూడా బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. ఫైనల్స్లో ఇరాన్పై మహిళల జట్టు 31-21 తేడాతో విజయం సాధించింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement