పురుషుల హాకీ: భారత్‌కు కాంస్యం

Indian Men Hockey Team Beats Pakistan 2-1 And Takes Bronze  - Sakshi

జకార్త:  ఆసియా క్రీడల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల హాకీ జట్టు ఈ సారి కాంస్యంతో సరిపెట్టింది. సెమీఫైనల్లో మలేషియాతో అనూహ్య ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో శనివారం  జరిగిన కాంస్య పోరులో భారత్‌ దాయాదీ పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 2-1తో గెలిచి కాంస్యం అందుకుంది. భారత్‌ ఆటగాడు మూడవ నిమిషంలో తొలి గోల్‌ నమోదు చేశాడు. అనంతరం 50వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మరో గోల్‌ చేయడంతో 2-0తో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్‌ అనంతరం రెండు నిమిషాలకే పాక్‌ ముహ్మద్‌ అతీఖ్‌ గోల్‌ సాధించడంతో స్కోర్‌ 2-1కు చేరింది. అనంతరం ఇరు జట్లు పోరాడిన గోల్‌ లభించలేదు. దీంతో భారత్‌ విజయం ఖాయమైంది. అయితే హాట్‌ ఫేవరట్‌గా బరిలోకి దిగిన భారత్‌కు మాత్రం కాంస్యమే లభించింది.

శనివారం రెండు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యంతో కలిపి మొత్తం భారత్‌కు నాలుగు పతకాలు వరించాయి. ఆసియా క్రీడల స్క్వాష్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత మహిళల స్క్వాష్‌ బృందం( దీపికా పళ్లికల్‌, జోష్నా చిన్నప్ప, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నా) రజతంతో సరిపెట్టింది. శనివారం జరిగిన మహిళల ఫైనల్‌ పోరులో భారత జట్టు 0-2తేడాతో హాంకాంగ్‌ చేతిలో ఓటమి పాలైంది. పురుషుల లైట్‌ ఫ్లై 49 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఆద్యంతం ఆసక్తిర రేపిన ఫైనల్లో అమిత్‌ 3-2 తేడాతో రియో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత దుస్మాతోవ్‌ హసన్‌బాయ్‌(ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి పసిడి గెలుచుకున్నాడు. ఇక బ‍్రిడ్జ్‌ ఈవెంట్‌లో సైతం భారత్‌  స్వర్ణం సాధించింది. మెన్స్‌ పెయిర్‌ ఫైనల్‌-2లో భారత్‌ జోడి ప్రణబ్‌ బర్దాన్‌- శివ్‌నాథ్‌ సర్కార్‌లు 384.00 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి సాధించారు. దీంతో భారత్‌ పతకాల సంఖ్య (15 స్వర్ణం, 24 రజతం, 30 కాంస్యం) 69కి చేరింది.

హాకీ క్రీడాకారుణలకు నజరానా..
ఏషియాడ్‌లో రజతం గెలిచిన మహిళల హాకీ జట్టులోని ఓడిశా క్రీడాకారుణులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కోటి నజరానా ప్రకటించారు. ఒడిశా నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సునితా లక్రా, నామితా టొప్పో, లిలిమా మింజ్‌, డీప్‌ గ్రేస్‌ ఎక్కాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయాల రివార్డ్‌ అందనుంది. ఇక రెండు పతకాలతో అదరగొట్టిన రాష్ట్ర స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌కు మూడుకోట్లు నగదు పురస్కారంతో పాటు త్వరలో జరగనున్న ఒలింపిక్‌ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top