మూడో వన్డే : విండీస్‌పై భారత్‌ విజయం | India Won the Series 2-0 vs West Indies With Kohli Century | Sakshi
Sakshi News home page

మూడో వన్డే : విండీస్‌పై భారత్‌ విజయం

Aug 15 2019 4:41 AM | Updated on Aug 15 2019 12:35 PM

India Won the Series 2-0 vs West Indies With Kohli Century - Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లి సేన కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158/2తో ఉండగా వాన ఆటను నిలిపివేసింది. కొంత సమయం తర్వాత మొదలైన ఆటకు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. దీంతో  విండీస్‌ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని భారత్‌ 32.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 114 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శ్రేయస్‌ అయ్యర్‌ 65 పరుగులు చేశాడు. కాగా, కోహ్లికిది 43 వ వన్డే సెంచరీ.

చదవండి: విండీస్‌ 240/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement