జెరెమీకి రజతం  | India won second medal at the Weightlifting tournament | Sakshi
Sakshi News home page

జెరెమీకి రజతం 

Feb 9 2019 3:23 AM | Updated on Feb 9 2019 3:23 AM

India won second medal at the Weightlifting tournament - Sakshi

న్యూఢిల్లీ: ఈజీఏటీ కప్‌ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో పురుషుల 67 కేజీల విభాగంలో భారత లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా రజత పతకం గెల్చుకున్నాడు. మిజోరం రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లాల్‌రినుంగా మొత్తం 288 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. అతడు స్నాచ్‌లో 131 కేజీలు... క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 157 కేజీలు బరువెత్తాడు. ఇండోనేసియా వెయిట్‌లిఫ్టర్‌ డెనీ 303 కేజీల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement