
ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2019 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సాధించింది. మకావుతో బెంగళూరులో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలిచింది. భారత్ తరఫున రౌలిన్ బోర్జెస్ (28వ ని.లో), కెప్టెన్ సునీల్ చెత్రి (60వ ని.లో), జెజె లాల్‌పెకులువా (90వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. 70వ నిమిషంలో మకావు ఆటగాడు లామ్ కా సెంగ్ సెల్ఫ్ గోల్ సాధించగా... 37వ నిమిషంలో నికొలస్ తరావు మకావుకు తొలి గోల్ అందించాడు. 2019 ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ మరోసారి అర్హత పొందింది.