విండీస్‌తో టీమిండియా షెడ్యూల్ ఇదే..

రాజ్‌కోట్: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు మంగళవారం వెస్టిండీస్‌తో జరగబోయే దాదాపు ఆరు వారాల సిరీస్ వివరాలను భారత క‍్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విడుదల చేసింది. విండీస్‌తో సిరీస్‌లో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు ఐదు వన్డేల సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నంబర్ 11వ తేదీ వరకూ ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరుగనుంది. ఆసియాకప్ ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా-విండీస్‌ల సిరీస్ ఆరంభం కానుండటం గమనార్హం. ఈనెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ యూఏఈ వేదికగా ఆసియాకప్ జరుగనుంది.
వెస్టిండీస్‌తో భారత్ షెడ్యూల్..
తొలి టెస్టు: అక్టోబర్ 4 నుంచి 8వరకూ, రాజ్‌కోట్
రెండో టెస్టు: అక్టోబర్ 12 నుంచి 16వరకూ, హైదరాబాద్
తొలి వన్డే: అక్టోబర్ 21, గుహవాటి
రెండో వన్డే: అక్టోబర్ 24 , ఇండోర్
మూడో వన్డే: అక్టోబర్ 27,పుణె
నాల్గో వన్డే: అక్టోబర్ 29, ముంబై
ఐదో వన్డే: నవంబర్1, తిరువనంతపురం
తొలి టీ20: నవంబర్ 4, కోల్‌కతా
రెండో టీ20: నవంబర్ 6, లక‍్నో
మూడో టీ20: నవంబర్ 11, చెన్నై
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి