
లుసానే (స్విట్జర్లాండ్): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకుంది. 2003లో ప్రపంచ ర్యాంకింగ్స్ మొదలయ్యాక భారత్ తొలిసారి నాలుగో స్థానానికి చేరుకుంది. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లోని తొలి మూడు రౌండ్లలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా నాలుగు నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ప్రపంచ చాంపియన్ బెల్జియం టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మహిళల విభాగంలోభారత జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది.