ఆరు స్థానాలు ఎగబాకిన భారత్ | India jump six places to 166th in football rankings | Sakshi
Sakshi News home page

ఆరు స్థానాలు ఎగబాకిన భారత్

Dec 3 2015 6:57 PM | Updated on Jun 15 2018 4:33 PM

ఆరు స్థానాలు ఎగబాకిన భారత్ - Sakshi

ఆరు స్థానాలు ఎగబాకిన భారత్

ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత ఫుట్బాల్ జట్టు ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకింది.

జురిచ్ : ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లో భారత ఫుట్బాల్ జట్టు ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకింది. గతంలో 172 వ ర్యాంకులో ఉన్న భారత్ గురువారం అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించిన ర్యాంకుల్లో 166వ స్థానాన్ని ఆక్రమించింది. స్విట్జర్లాండ్ లోని జురిచ్ నగరంలో ఫిఫా ఈ ర్యాంకులు విడుదలచేసింది. గత నెలలో ఫస్ట్ ర్యాంకు సాధించిన బెల్జియం తాజా ర్యాంకింగ్స్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

గతనెలలో 2018 ప్రపంచకప్ అర్హత కోసం నిర్వహించిన మ్యాచ్ల్లో వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయిన భారత్ 172వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తర్వాత నిలకడ ఆటతీరు ప్రదర్శించి ఆరు స్థానాలు మెరుగు పరుచుకుంది. బెల్జియం అగ్రస్థానాన్ని ఆక్రమించగా..  అర్జెంటైనా, స్పెయిన్, జర్మనీలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులను దక్కించుకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement