‘వరల్డ్‌కప్‌ గెలిచేందుకు మనకు మంచి చాన్స్‌’ | India have fantastic chance to win World Cup, Vengsarkar | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌కప్‌ గెలిచేందుకు మనకు మంచి చాన్స్‌’

May 6 2019 8:01 PM | Updated on May 29 2019 2:38 PM

India have fantastic chance to win World Cup, Vengsarkar - Sakshi

ముంబై: మరొకసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచేందుకు టీమిండియా ముందు సువర్ణావకాశం ఉందని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగసర్కార్‌ పేర్కొన్నాడు. వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టును బట్టి చూస్తే విరాట్‌ కోహ్లి అండ్‌ గ్యాంగ్‌కు కప్‌ను అందుకునేందుకు మంచి చాన్స్‌ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ‘ వరల్డ్‌కప్‌ను గెలిచేందుకు భారత క్రికెట్‌ జట్టుకు ఇదొక అద్భుతమైన అవకాశం.  మన జట్టు కచ్చితంగా టాప్‌-4 జట్లలో ఉంటుంది. కానీ ఫైనల్‌ను ఎలా ఉంటున‍్నది నేను మాత్రం చెప్పలేను. ప్రస్తుతం ఉన్న జట్టు బలాన్ని బట్టి పోల్చుకుంటే వరల్డ్‌కప్‌ను గెలవడానికి చాన్స్‌లు మనకే ఉన్నాయి. భారత క్రికెటర్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. వారికి సక్సెస్‌ చేకూరాలని ముందుగానే వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని వెంగీ తెలిపాడు.

ఇక ముంబై ప్రీమియర్‌ లీగ్‌(ఎంపీఎల్‌) గురించి మాట్లాడుతూ.. ‘ యువ క్రికెటర్లకు ఇదొక చక్కటి వేదిక. త్వరలో రెండో సీజన్‌లోకి అడుగుపెట్టబోతున్న ఈ లీగ్‌లో దాదాపు 160 ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్‌లో తొలి సీజన్‌లో ఆకట్టుకున్న వాళ్లు ఐపీఎల్‌లో చాన్స్‌ దొరకబుచ్చుకున్నారు. గత సీజన్‌లో ఎంపీఎల్‌లో మెరుగ్గా ఆడిన శివం దూబే.. ఈసారి ఐపీఎల్‌లో స్థానం దక్కించుకున్నాడు. కచ్చితంగా ఈ లీగ్‌ యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని వెంగీ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement