ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్ | india entered in Archery world cup | Sakshi
Sakshi News home page

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్

May 18 2014 1:22 AM | Updated on Sep 2 2017 7:28 AM

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్

ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్

కొలంబియాలోని మెడెలిన్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

కొరియాతో స్వర్ణపతక పోరుకు సిద్ధం
 కోల్‌కతా: కొలంబియాలోని మెడెలిన్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో రెండో సీడ్‌గా ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించిన భారత్.. సెమీఫైనల్లో 5-3 తేడాతో చైనాపై విజయం సాధించింది. అంతకుముందు 6-0 తేడాతో స్పెయిన్‌పై, 6-2 తేడాతో చిలీపై గెలుపొంది సెమీస్‌కు చేరింది.
 
  సంజయ్ బోరో, అటానుదాస్, తుపువోయి స్వురోలతో కూడిన భారత బృందం ఇక స్వర్ణం కోసం ప్రపంచ చాంపియన్ కొరియాతో తలపడనుంది. మరోవైపు భారత మహిళల రికర్వ్ బృందం తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. దీపికా కుమారి గైర్హాజరీలో మహిళల జట్టు 3-5 తేడాతో ఇటలీ చేతిలో ఓటమిపాలైంది. అయితే మిక్స్‌డ్ రికర్వ్‌లో భారత్ కాంస్యం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాస్-బొంబేలా దేవి జంట మిక్స్‌డ్‌లో మెక్సికోతో తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement