‘పసిడి’పై భారత ఆర్చరీ జట్ల గురి

India in compound women's archery team final - Sakshi

కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో ఫైనల్లోకి

ఆర్చరీ కాంపౌండ్‌ విభాగంలో భారత జట్లు  స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించి పతకాలను ఖాయం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 225–222తో చైనీస్‌ తైపీపై గెలిచింది.  పురుషుల విభాగంలో అభిషేక్‌ వర్మ, అమన్‌ సైనీ, రజత్‌ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 230–227తో చైనీస్‌ తైపీ బృందంపై నెగ్గింది. మంగళవారం పసిడి పతకాల కోసం జరిగే ఫైనల్స్‌లో దక్షిణ కొరియా జట్లతో భారత పురుషుల, మహిళల జట్లు తలపడతాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top