జూడోలో భారత్‌కు 10 స్వర్ణాలు

India bags 10 gold medals in South Asian Judo Championship - Sakshi

​ఖట్మాండు : నేపాల్‌ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత ‍క్రీడాకారులు 10 స్వర్ణాలు సాధించారు. 14 పతకాల కోసం సాగిన పోరులో భారత మహిళలు సింగిల్స్‌ విభాగంలో 7 పతకాలు సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో మూడు పతకాలు గెలుచుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత్‌ మూడు కాంస్యలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించగా ఆతిథ్య నేపాల్‌ 2 బంగారు 6 రజత, 13 కాంస్య పతకాలతో 21, పాకిస్తాన్‌ 2 బంగారు, మూడు రజత, మూడు కాంస్యలతో 8 పతకాలను సొంతం చేసుకుంది.

శ్రీలంక 3 బంగారు, 5 రజతాలతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్‌ రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది. ఇక భూటాన్‌ కేవలం ఒక కాంస్యంతో సరిపెట్టుకుంది.  ఇక టీమ్‌ ఈవెంట్‌ విభాగం ఫైనల్లో భారత మహిళలు ఆతిథ్య నేపాల్‌పై 5-0తో విజయం సాధించగా.. పురుషుల జట్టు ఫైనల్లో 3-2 తేడాతో పాక్‌పై గెలుపొందింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top