breaking news
South Asian Judo Championship
-
జూడోలో భారత్‌కు 10 స్వర్ణాలు
ఖట్మాండు : నేపాల్ వేదికగా జరుగుతున్న దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు 10 స్వర్ణాలు సాధించారు. 14 పతకాల కోసం సాగిన పోరులో భారత మహిళలు సింగిల్స్ విభాగంలో 7 పతకాలు సాధించగా.. పురుషుల సింగిల్స్‌లో మూడు పతకాలు గెలుచుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత్ మూడు కాంస్యలతో కలిపి మొత్తం 13 పతకాలు సాధించగా ఆతిథ్య నేపాల్ 2 బంగారు 6 రజత, 13 కాంస్య పతకాలతో 21, పాకిస్తాన్ 2 బంగారు, మూడు రజత, మూడు కాంస్యలతో 8 పతకాలను సొంతం చేసుకుంది. శ్రీలంక 3 బంగారు, 5 రజతాలతో మొత్తం 8 పతకాలు గెలుచుకుంది. బంగ్లాదేశ్ రెండు రజత, రెండు కాంస్య పతకాలు సాధించింది. ఇక భూటాన్ కేవలం ఒక కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇక టీమ్ ఈవెంట్ విభాగం ఫైనల్లో భారత మహిళలు ఆతిథ్య నేపాల్‌పై 5-0తో విజయం సాధించగా.. పురుషుల జట్టు ఫైనల్లో 3-2 తేడాతో పాక్‌పై గెలుపొందింది. -
భారత్‌కు పది స్వర్ణాలు
దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: ఖాట్మండులో జరిగిన దక్షిణాసియా జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ 10 స్వర్ణాలతో ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 12 మందితో కూడిన భారత జుడోకాల బృందం 10 స్వర్ణాలతోపాటు ఒక్కొక్కటి చొప్పున రజతం, కాంస్య పతకాలు సాధించారు. భారత్‌తోపాటు దక్షిణాసియాలోని అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. భారత బృందంలో పురుషుల విభాగంలో నవ్‌జోత్ చానా (60 కేజీ), ఐరోమ్ సంజూ సింగ్ (66 కేజీ), నవ్‌దీప్ చానా (73 కేజీ), వికేందర్ సింగ్ (81 కేజీ), అవతార్‌సింగ్ (90 కేజీ)లు స్వర్ణాలు సాధించగా, ఖెదైమ్ యైమా సింగ్ (100 కేజీ) రజతం దక్కించుకున్నాడు. మహిళల్లో అంగోమ్ అనితా చాను (52 కేజీ), సుచికా తరియాల్ (57 కేజీ), గరిమా చౌదరి (63 కేజీ), హిడ్రామ్ సునిబాల దేవి (70 కేజీ), జైన దేవి (78 కేజీ)లు పసిడి, రజనీ బాల (48 కేజీ) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.