రెండో టెస్టు:భారత్ తొలి ఇన్నింగ్స్ 334 | india all out for 334 in first innings | Sakshi
Sakshi News home page

రెండో టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 334

Dec 27 2013 8:22 PM | Updated on Sep 2 2017 2:01 AM

రెండో టెస్టు:భారత్ తొలి ఇన్నింగ్స్ 334

రెండో టెస్టు:భారత్ తొలి ఇన్నింగ్స్ 334

దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులకే పరిమితమైంది.

డర్బన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 334 పరుగులకే పరిమితమైంది. తొలిరోజు  నిలకడగా ఆడి భారీ స్కోరు దిశగా పయనించిన భారత్, రెండో రోజు మాత్రం వరుస వికెట్లు కోల్పోయింది. ఒకవైపు భారత్ వికెట్లు కూలుతున్నా రహేనా(51) పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.  భారత ఆటగాళ్లలో శిఖర్ థావన్ (29), మురళీ విజయ్ (97), పుజారా(70), కోహ్లి(46), ధోని (24) పరుగులు చేశారు.

 

తొలి రోజు ధోనిసేన పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా.... రెండో రోజు సఫారీ బౌలింగ్ ముందు తేలిపోయారు. వికెట్టు నష్టానికి 181 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా అటాకింగ్ ముందు నిలకవలేక సతమతమైయ్యారు. భారత్ టాప్ ఆర్డర్ ను దక్షిణాఫ్రికా పేసర్లు కకావికలం చేశారు. దక్షిణా ఫ్రికా బౌలర్లలో స్టెయిన్ కు ఆరు వికెట్లు లభించగా, మోర్కెల్ మూడు వికెట్లు, డుమినీకి ఒక వికెట్టు లభించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement