ఆస్ట్రేలియా ‘ఎ’ తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత ఆటగాళ్లు తడబడ్డారు.
ఆస్ట్రేలియా ‘ఎ’తో టెస్టు
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’ తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత ఆటగాళ్లు తడబడ్డారు. మనీష్ పాండే (76 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా... మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్‌సలో 81.3 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటయింది. ఫయాజ్ ఫజల్ (48) రాణించాడు. లెగ్ స్పిన్నర్ మిషెల్ స్పెప్సన్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్‌స ఆరంభించిన ఆసీస్ ‘ఎ’ ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది.