భారత్‌ ‘ఎ’ 274 ఆలౌట్‌ | India A 274 all out | Sakshi
Sakshi News home page

భారత్‌ ‘ఎ’ 274 ఆలౌట్‌

Sep 4 2018 1:30 AM | Updated on Sep 4 2018 1:30 AM

India A 274 all out - Sakshi

బెంగళూరు: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతోన్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ బ్యాట్స్‌మన్‌ అంకిత్‌ బావ్నే (159 బంతుల్లో 91 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటై 31 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
 

రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆట ముగిసే సమయానికి 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. ఖాజా (16 బ్యాటింగ్‌), హెడ్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో మరో 9 వికెట్లున్న ఆసీస్‌ ప్రస్తుతం 11 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement