జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 10 ఓవర్లలో 71 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.
హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో 146 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 10 ఓవర్లలో 71 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బతగిలింది. తొలి ఓవర్లోనే రహానే రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఉతప్ప, ఓపెనర్ విజయ్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పరుగులు రాబట్టే క్రమంలోనే 57 పరుగుల వద్ద క్రెమెర్ బౌలింగ్లో విజయ్(13) అవుటయ్యాడు. మనీష్ పాండే(0), ఉతప్ప (25 బంతుల్లో 42 పరుగులు), జాదవ్(5) వికెట్లని భారత్ వెంటవెంటనే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ప్రస్తుతం బిన్నీ(7),శామ్సన్(3)లు క్రీజ్ లో ఉన్నారు.