భారత్‌కు 2 రజతాలు  | India Anjum Moudgil, Apurvi Chandela secure 2020 Tokyo Olympic spots | Sakshi
Sakshi News home page

భారత్‌కు 2 రజతాలు 

Sep 4 2018 1:22 AM | Updated on Sep 17 2018 4:27 PM

 India Anjum Moudgil, Apurvi Chandela secure 2020 Tokyo Olympic spots - Sakshi

చాంగ్‌వాన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ సీనియర్‌ విభాగంలో భారత్‌ ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో భారత్‌కు రజత పతకాలు లభించాయి. వ్యక్తిగత విభాగంలో అంజుమ్‌ మౌద్గిల్‌  (248.4 పాయింట్లు) రజతం నెగ్గగా... అంజుమ్, అపూర్వీ చండేలా, మెహులీ ఘోష్‌లతో కూడిన భారత జట్టు (1879 పాయింట్లు) రజతం సాధించింది. అపూర్వీ చండేలా (207 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. అంజుమ్, అపూర్వీ టాప్‌–4లో నిలిచినందుకు భారత్‌కు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండు బెర్త్‌లు ఖరారయ్యాయి.     

Advertisement
 
Advertisement
Advertisement