తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా | Ind Vs Ban: Team India Lose 1st Wicket At 26 Runs | Sakshi
Sakshi News home page

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా

Nov 22 2019 5:20 PM | Updated on Nov 22 2019 6:09 PM

 Ind Vs Ban: Team India Lose 1st Wicket At 26 Runs - Sakshi

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరిగిన గత టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌.. ఇక్కడ జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త జోష్‌లో కనిపించిన మయాంక్‌ 14 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లోకి కనిపించినప‍్పటికీ అల్‌ అమిన్‌ వేసిన బంతికి గల్లీలో క్యాచ్‌లో ఇచ్చి ఔటయ్యాడు. ఆఫ్‌ స్టంప్‌పై పడ్డ బంతిని ఆడబోయిన మయాంక్‌... మెహిదీ హసన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో 26 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది.

అంతకుముందు బంగ్లాదేశ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. షాద్‌మన్‌ ఇస్లామ్‌(29), లిటాన్‌ దాస్‌(24 రిటైర్డ్‌ హర్ట్‌), నయిమ్‌ హసన్‌(19)లు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లు సాధించగా, ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లతో సత్తాచాటాడు. షమీకి రెండు వికెట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement