బంగ్లాతో టెస్టు: వృద్ధిమాన్‌ సాహా ‘సెంచరీ’

Ind Vs Ban: Saha Joins Elite List Of Indian Wicket Keepers - Sakshi

కోల్‌కతా: టీమిండియా వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. తన టెస్టు కెరీర్‌లో 100 ఔట్లలో భాగస్వామ్యమై ఆ ఫీట్‌ సాధించిన ఐదో భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు పుస్తకాల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌తో ఇక్కడ జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో ఆ జట్టు ఓపెనర్‌ షాదమన్‌ ఇస్లామ్‌(29) ఇచ్చిన క్యాచ్‌ను పట్టడం ద్వారా సెంచరీ డిస్మిల్స్‌ మార్కును చేరాడు. ఇందులో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి.

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15 ఓవర్‌ రెండో బంతిని షాద్‌మన్‌ ఆడబోగా అది ఎడ్జ్‌ తీసుకుని వికెట్ల వెనక్కు వెళ్లింది. అది ఫస్ట్‌ స్లిప్‌కు వెళుతుండగా సాహా అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకుని మరోసారి కీపర్‌ విలువను చాటిచెప్పాడు. ఈ మ్యాచ్‌కు ముందు 99 డిస్మిల్స్‌ తో ఉన్న సాహా.. షాద్‌మన్‌ క్యాచ్‌ను అందుకోవడం సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత ఇషాంత్‌ వేసిన 20 ఓవర్‌ నాల్గో బంతికి మహ్మదుల్లా క్యాచ్‌ను కూడా సాహానే అందుకున్నాడు.(ఇక్కడ చదవండి:కోహ్లినే బిత్తర పోయేలా..)

భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక ఔట్లలో భాగస్వామ్యమైన జాబితాలో ఎంఎస్‌ ధోని(294) అగ్రస్థానంలో ఉండగా, కిర్మాణీ(198) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో కిరణ్‌ మోరే(130) ఉండగా, నాల్గో స్థానంలో నయాన్‌ మోంగియా(107) ఉన్నాడు. ఆ తర్వాత  స్థానాన్ని సాహా ఆక్రమించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top