పింక్‌ బాల్‌ టెస్టు టికెట్‌ డబ్బులు వాపస్‌! | Ind vs Ban: Fans To Get Ticket Refund For Final Two Days | Sakshi
Sakshi News home page

పింక్‌ బాల్‌ టెస్టు టికెట్‌ డబ్బులు వాపస్‌!

Nov 25 2019 4:12 PM | Updated on Nov 25 2019 4:51 PM

Ind vs Ban: Fans To Get Ticket Refund For Final Two Days - Sakshi

కోల్‌కతా: టీమిండియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య నగరంలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగిన రెండో టెస్టు మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట తొలి సెషన్‌లో బంగ్లా ఆలౌట్‌  కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది.  నవంబర్‌ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ జరగాల్సిన  పింక్‌ బాల్‌ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ 24వ తేదీనే ముగిసింది.

మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడంతో చివరి రెండు రోజులు టిక్కెట్టు కొనుక్కున్న క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, ఆ రెండు రోజుల(నవంబర్‌ 25,26) కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) టికెట్‌ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు సోమవారం క్యాబ్‌ ఓ నిర్ణయం తీసుకుంది.  మిగిలిన రెండు రోజుల టికెట్లు తీసుకున్న వారికి తిరిగి డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది. వర్షం కారణంగా కానీ, మిగతా కారణాల వల్ల కానీ మ్యాచ్‌లు రద్దయితే  ప్రేక్షకుల డబ్బుల్ని చెల్లించడం అరుదుగా జరుగుతుంది. అది ఆ సదరు క్రికెట్‌ అసోసియేషన్‌ ఇష్టాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. చివరి రెండు రోజులకు డబ్బులు చెల్లించాలనే క్యాబ్‌ నిర్ణయం తీసుకోవడంతో మొత్తం మ్యాచ్‌కు టికెట్లు కొన్న వారికి ఊరట కల్గించింది. గతంలో హెచ్‌సీఏ కూడా ఇదే తరహాలో నగదును తిరిగి ఇచ్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement