సెమీ ఫైనల్‌ రేసులో... | icc world cup 2019 England vs New Zealand | Sakshi
Sakshi News home page

సెమీ ఫైనల్‌ రేసులో...

Jul 3 2019 5:37 AM | Updated on Jul 3 2019 5:37 AM

icc world cup 2019 England vs New Zealand - Sakshi

విలియమ్సన్, మోర్గాన్‌

చెస్టర్‌ లీ స్ట్రీట్‌:  ప్రపంచ కప్‌ ఆతిథ్య జట్టు, ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు తమ చివరి మ్యాచ్‌ వరకు శ్రమించాల్సిన పరిస్థితి! ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌ చోటు దక్కించుకునే ప్రయత్నంలో మోర్గాన్‌ సేన నేడు (బుధవారం) జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్‌పై విజయంతో కోలుకున్న ఇంగ్లండ్‌... ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. ఒక వేళ ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది.

మరో వైపు గత మ్యాచ్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ కూడా విజయం సాధించి దర్జాగా ముందంజ వేయాలని కోరుకుంటోంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఒక్కసారిగా ఫామ్‌లోకి రాగా... కివీస్‌ ప్రధానంగా విలియమ్సన్, టేలర్‌లపైనే ఆధార పడుతోంది. 2015 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 123 పరుగులకే కుప్పకూలగా కివీస్‌ 12.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చు కోవాలని కూడా ఇంగ్లండ్‌ భావిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement