‘నన్ను రావద్దనే సందేశం వచ్చింది’

 I Got The Message From The Training Base Disappoints, Dutee Chand  - Sakshi

భువనేశ్వర్‌:  కరోనా వైరస్‌ ప్రభావంతో జర్మనీలో జరగాల్సిన పలు అథ్లెటిక్స్‌  పోటీలు రద్దవడంతో భారత అగ్రశ్రేణి స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ ఆందోళనలో పడ్డారు. విశ్వక్రీడలకు అర్హత సాధించాలన్న ఆమె లక్ష్యం ఇప్పటికైతే తాత్కాలికంగా నిలిచిపోయింది. జర్మనీ వెళ్లేందుకు గతంలోనే వీసా మంజూరైనా కరోనా వైరస్‌ ప్రభావంతో అక్కడికి వెళ్లేందుకు ద్యుతీకి అనుమతి లభించలేదు. ఒకవైపు ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ను నిర్వహిస్తామని ఐఓసీ పెద్దలు చెబుతుండగా, మరొకవైపు అథ్లెట్లు క్వాలిఫయింట్‌ టోర్నీల్లో పాల్గొనాల్సింది.

ఈ క్రమంలోనే మార్చి 2వ తేదీ నుంచి ఆరంభమైన ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్లలో భారత స్ప్రింటర్‌ ద్యుతీ పాల్గొనాల్సి ఉంది. ఇక్కడ ముందుగానే వీసా అందుకున్న చివరి నిమిషంలో ఆంక్షలు విధించారు. ఫలితంగా ద్యుతీ తన జర్మనీ పర్యటనను విధిలేని పరిస్థితుల్లో వదులు కోవాల్సి వచ్చింది. . ‘వీసాతో పాటు జర్మనీకి వెళ్లేందుకు కావాల్సిన పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే వైరస్‌ కారణంగా ఇక్కడికి వచ్చేందుకు వీల్లేదంటూ ఆ దేశంలోని ట్రైనింగ్‌ క్యాంప్‌ నుంచి సందేశం వచ్చింది. నేను చాలా నిరాశచెందా. 100మీటర్ల పోటీలో ఒలింపిక్స్‌ అర్హత 11.15సెకన్లు. యూరప్‌లో మంచి నైపుణ్యం అథ్లెట్లు ఉన్నారు. పోటీ అయితే ఎ‍క్కువ లేదు. నేను  క్వాలిఫయింగ్‌ టోర్నీల్లో భాగంగా పలు మెరుగైన కాంపిటీషన్లలో పాల్గొనడానికి ఎప్పట్నుంచో సిద్ధమయ్యా. నా ప్రణాళికలన్నీ ఆవిరైపోయాయి’ ద్యుతీ నిరాశ వ్యక్తం చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top