ఓవరాల్‌ చాంప్‌ హైదరాబాద్‌ | hyderabad is overall champ of taekwondo | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంప్‌ హైదరాబాద్‌

Feb 16 2017 10:49 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్టు సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్థాయి తైక్వాండో చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్‌ తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో జరిగి న ఈ టోర్నీలో హైదరాబాద్‌ జట్టు ఓవరాల్‌ చాం పియన్‌గా నిలిచింది. మొత్తం 500 మంది క్రీడాకారులు తలపడిన ఈ పోటీల్లో హైదరాబాద్‌ 27 స్వర్ణాలను గెలుచుకొని అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

 

ఇందులో రాణించిన జూనియర్‌  క్రీడాకారులు మార్చి 2 నుంచి 5 వరకు కాన్పూర్‌లో జరిగే సబ్‌ జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ లో... సీనియర్‌ క్రీడాకారులు మార్చి 17 నుంచి 19 వరకు విశాఖపట్నంలో జరిగే సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement