హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ డ్రా | Hyderabad,chhattisgarh match draw | Sakshi
Sakshi News home page

హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ డ్రా

Dec 26 2014 12:43 AM | Updated on May 29 2018 11:15 AM

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్-23 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాడ్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ
 రాయ్‌పూర్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ అండర్-23 క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాడ్, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో హిమాలయ్ అగర్వాల్ సెంచరీ సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో ఎ. అకాశ్ 4 పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.
 
 గురువారం 245/6 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 294 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ హిమాలయ్ అగర్వాల్ (182 బంతుల్లో 114, 16 ఫోర్లు) శతకం సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో షానవాజ్ 5, అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో ఛత్తీస్‌గఢ్‌కు 316 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తర్వాత ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఆకాశ్ (193 బంతుల్లో 96, 16 ఫోర్లు) రాణించాడు. వంశీవర్ధన్ 41, కె.సుమంత్ 25 పరుగులు చేశారు. ఛత్తీస్‌గఢ్ బౌలర్ వి.కె.రాజ్‌పుత్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఛత్తీస్‌గఢ్ 3 పాయింట్లు పొందగా, హైదరాబాద్‌కు ఒక పాయింట్ దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement