హైదరాబాద్ 438 ఆలౌట్ | hyderabad bowled out at 438 in second innings | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ 438 ఆలౌట్

Nov 7 2016 10:31 AM | Updated on Sep 4 2018 5:24 PM

సౌరాష్ట్రతో జరుగుతున్న కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 154.2 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది.

సాక్షి, హైదరాబాద్: సౌరాష్ట్రతో జరుగుతున్న కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 154.2 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. 284/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్‌కు షేక్ సొహైల్ (112), జీవీ వినీత్ రెడ్డి (157) సెంచరీలతో భారీ స్కోరును అందించారు. సౌరాష్ట్ర బౌలర్లలో దేవంగ్ 3, కరణ్ 4, ప్రణవ్ కరియా 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement