సాఫ్ట్ బాల్ రన్నరప్‌ హైదరాబాద్‌ | hyderabad as runnerup in soft ball championship | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ బాల్ రన్నరప్‌ హైదరాబాద్‌

Jul 10 2017 10:53 AM | Updated on Sep 4 2018 5:07 PM

సాఫ్ట్ బాల్ రన్నరప్‌ హైదరాబాద్‌ - Sakshi

సాఫ్ట్ బాల్ రన్నరప్‌ హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర మినీ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ బాలికల జట్టు రాణించింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మినీ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ బాలికల జట్టు రాణించింది. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో జరిగిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్‌ 0–10తో నిజామాబాద్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మూడోస్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో మెదక్‌ జట్టు 6–5తో నల్లగొండపై గెలుపొందింది. బాలుర విభాగంలో వరంగల్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది.

 

ఫైనల్లో వరంగల్‌ 10–0తో నిజామాబాద్‌పై గెలుపొందింది. రంగారెడ్డి జట్టు 3–2తో ఆదిలాబాద్‌పై నెగ్గి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో బేగంబజార్‌ కార్పొరేటర్‌ జి. శంకర్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌ కార్పొరేటర్‌ మమతా సంతోష్‌ గుప్తా, రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ సంఘం కార్యదర్శి కె. శోభన్‌బాబు, కోశాధికారి డి. అభిషేక్‌ గౌడ్‌ పాల్గొన్నారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement