ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌ | Hyamars Hariyana Team in final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌

Jan 18 2017 1:19 AM | Updated on Sep 5 2017 1:26 AM

ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌

ఫైనల్లో హరియాణా హ్యామర్స్‌

సందీప్‌ తోమర్, రజనీష్‌ విశేషంగా రాణించి కీలక విజయాలు అందించడంతో హరియాణా హ్యామర్స్‌ జట్టు ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

న్యూఢిల్లీ: సందీప్‌ తోమర్, రజనీష్‌ విశేషంగా రాణించి కీలక విజయాలు అందించడంతో హరియాణా హ్యామర్స్‌ జట్టు ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో హరియాణా 6–3తో జైపూర్‌ నింజాస్‌పై గెలిచింది. పంజాబ్‌ రాయల్స్, ముంబై మహారథి జట్ల మధ్య బుధవారం జరిగే రెండో సెమీస్‌ విజేతతో గురువారం జరిగే ఫైనల్లో హరియాణా తలపడుతుంది. మ్యాచ్‌ తొలి బౌట్‌ (74 కేజీలు)లో జాకబ్‌ మకరషివిలి 10–0తో సుమీత్‌ (హరియాణా)పై గెలిచాడు. మహిళల 48 కేజీల బౌట్‌లో రీతూ ఫోగట్‌ 8–0తో ఇందుపై నెగ్గి జైపూర్‌ ఆధిక్యాన్ని 2–0కి పెంచింది. అయితే హరియాణాకు చెందిన విదేశీ రెజ్లర్లు మగోమెడ్‌ (70 కేజీలు), మర్వా అమ్రి (58 కేజీలు) తమ బౌట్లలో నెగ్గి స్కోరును 2–2తో సమం చేశారు.

65 కేజీల విభాగంలో రజనీష్‌ 8–6తో రాహుల్‌ మన్‌పై నెగ్గి హరియాణాకు 3–2తో ఆధిక్యాన్ని అందించాడు. ఈ దశలో జైపూర్‌ రెజ్లర్‌ జెన్నీ ఫ్రాన్సన్‌ (75 కేజీలు) 8–0తో కిరణ్‌పై గెలిచి 3–3తో స్కోరును సమం చేసింది. ఇక అద్భుత ఫామ్‌లో ఉన్న సందీప్‌ తోమర్‌ (57 కేజీలు) 5–4తో ఉత్కర్‌‡్షపై నెగ్గి హరియాణాకు 4–3 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం వరుసగా సోఫియా మాట్సన్‌ (53 కేజీలు) 8–0తో బెట్‌జబెత్‌ (జైపూర్‌)పై, అబ్దుసలామ్‌ గడిసోవ్‌ (97 కేజీలు) 5–4తో ఎలిజబార్‌ (జైపూర్‌)పై గెలిచి హరియాణా విజయాన్ని సులువు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement