ఢిల్లీకి భారీ విజయం | huge win to delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి భారీ విజయం

Nov 10 2016 12:46 AM | Updated on Sep 4 2017 7:39 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డైనమోస్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది.

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఢిల్లీ డైనమోస్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైయిన్ ఎఫ్‌సీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4-1 గోల్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీ తరఫున గాడ్జె (15వ ని.లో), లూయిస్ (54వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... కెప్టెన్ ఫ్లోరెంట్ మలూడా (25వ, 85వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. చెన్నైయిన్ జట్టుకు మెండీ (37వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. ప్రస్తుతం ఢిల్లీ 16 పారుయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబైతో పుణే తలపడుతుంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement