ఐపీఎల్‌ ఫైనల్‌ చాలా ‘హాట్‌’ 

Hotstar breaks global records in IPL 2019 final, registers 18.6 million concurrent viewers - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌ వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘హాట్‌ స్టార్‌’లో సూపర్‌ హిట్టయింది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను ఒకే సమయంలో గరిష్టంగా 18.6 మిలియన్ల (1 కోటి 86 లక్షలు) వీక్షకులు చూసినట్లు హాట్‌ స్టార్‌ ప్రకటించింది. ఇదే టోర్నీ మరో మ్యాచ్‌లో నమోదైన 12.7 మిలియన్ల రికార్డుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గత ఏడాది ఇదే హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను చూసిన వారితో పోలిస్తే ఈ సారి వీక్షకుల సంఖ్య ఏకంగా 74 శాతం పెరగడం విశేషం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top