రాష్ట్ర మహిళల హాకీ జట్టు ప్రకటన | Hockey Womens Team of Telangana announced | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మహిళల హాకీ జట్టు ప్రకటన

Jan 30 2019 9:35 AM | Updated on Jan 30 2019 9:35 AM

Hockey Womens Team of Telangana announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హాకీ ఇండియా నేషనల్స్‌ టోర్నీలో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ మహిళల జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎం. రేఖ, వైస్‌ కెప్టెన్‌గా శ్రుతి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు హరియాణాలోని హిస్సార్‌లో ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ హాకీ అధ్యక్షుడు సరళ్‌ తల్వార్‌ రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హాకీ సంఘం కార్య దర్శి ముకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

జట్టు: రుచిక, శ్రుతి, శ్రీదేవి, గంగా జమున,  హారిక, ఎం. రేఖ (కెప్టెన్‌), టి. ప్రియాంక, ఆర్‌. మాధురి, సాగరిక, వైష్ణవి, పూజ, రమ్య, కవిత, దేవి, సుమన్, బి. అశ్విన్, జ్ఞాన్‌ చంద్‌ (కోచ్‌), ఉదయ్‌ (అసిస్టెంట్‌ కోచ్‌), బి. అశ్విని (మేనేజర్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement