అత్యధిక పరుగుల కెప్టెన్‌ ధోనినే | Highest Runs By A Captain Record Created By Dhoni | Sakshi
Sakshi News home page

అత్యధిక పరుగుల కెప్టెన్‌ ధోనినే

May 1 2018 11:32 AM | Updated on May 2 2018 7:59 AM

Highest Runs By A Captain Record Created By Dhoni - Sakshi

ఢిల్లీతో మ్యాచ్‌లో ధోని

సాక్షి, హైదరాబాద్‌ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. సోమవారం ఢిల్లీపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మహీ రికార్డు నెలకొల్పారు.

ఇప్పటివరకూ ఈ రికార్డు గౌతమ్‌ గంభీర్ (3518 పరుగులు) పేరిట ఉండేది. కాగా, ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన ధోనీ (3536 పరుగులతో) దాన్ని అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో విరాట్‌ కొహ్లీ (3333 పరుగులు), రోహిత్ శర్మ (2198 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గంభీర్, కోహ్లి, రోహిత్‌ల కంటే ముందుండటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement