హీట్స్’ హోం గ్రౌండ్‌లో... | Heats, "Home Ground ... | Sakshi
Sakshi News home page

హీట్స్’ హోం గ్రౌండ్‌లో...

Aug 26 2016 12:54 AM | Updated on Sep 4 2017 10:52 AM

హీట్స్’ హోం గ్రౌండ్‌లో...

హీట్స్’ హోం గ్రౌండ్‌లో...

టి20 సిరీస్‌కు ముందు లభించిన విరామంలో భారత ఆటగాళ్లు అమెరికాలో సరదాగా గడుపుతున్నారు.

ఫ్లోరిడా: టి20 సిరీస్‌కు ముందు లభించిన విరామంలో భారత ఆటగాళ్లు అమెరికాలో సరదాగా గడుపుతున్నారు. అశ్విన్, ధావన్, భువనేశ్వర్ గురువారం అమెరికా బాస్కెట్ బాల్ టీమ్ ‘మియామీ హీట్స్’ హోం గ్రౌండ్ ‘ది అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఎరీనా’ను సందర్శించారు. జట్టు ఆటగాళ్లు టైలర్ జాన్సన్, బ్రియాంట్ వెబర్‌లతో ముచ్చటించిన క్రికెటర్లు... కొద్ది సేపు బాస్కెట్‌బాల్ కూడా ఆడారు. ఇతర భారత జట్టు సభ్యులలో కొందరు షాపింగ్ చేయగా, మరికొందరు హోటల్ రూంలకే పరిమితమయ్యారు.


భారత్‌నుంచి ధోని, బుమ్రా కలిసి బుధవారం ఫ్లోరిడా చేరుకున్నారు. మరో వైపు ఈ సిరీస్‌ను 0-2తో ఓడితే టీమిండియా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండు నుంచి మూడో స్థానానికి పడిపోతుంది. 2-0తో గెలిస్తే నంబర్‌వన్‌కు చేరువయ్యే అవకాశం ఉండగా... 1-1తో సిరీస్ ముగిస్తే రెండో స్థానంలోనే కొనసాగుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement