షమీ వ్యవహారం: తెరపైకి మరో పేరు!

Hasin Jahan Says That Mohammed Bhai Introduce Ladies To Shami - Sakshi

మహ్మద్ బాయ్ షమీకి అమ్మాయిలను పరిచయం చేస్తాడు

కేసు వెనక్కి తీసుకుంటే మంచిదంటున్నాడు షమీ

భర్త నుంచి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి

క్రికెటర్ షమీ భార్య హసీన్ జహాన్ 

సాక్షి, న్యూఢిల్లీ: భారత క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఓరోజు తగ్గినట్లు కనిపించినా.. ఆ మరుసటి రోజు మరిన్ని ఆరోపణలతో షమీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అతడి భార్య. వేధింపులు, అత్యాచార ఆరోపణలు, వివాహేతర సంబంధాలపై షమీపై ఫిర్యాదు చేసిన భార్య హసీన్ జహాన్ తాజాగా మంజు మిశ్రా అనే యువతితోనూ భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆమె చేస్తున్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పేసర్ షమీ తనకు తెలుసునని లండన్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే వ్యక్తి ఇటీవల స్పష్టం చేశాడు. కాగా, నగదు బదిలీలు మాత్రం జరగలేదని చెప్పాడు. తన భర్త షమీకి మహ్మద్ బాయ్ అనే వ్యక్తి అమ్మాయిలను పరిచయం చేస్తుంటాడని హసీన్ జహాన్ ఆరోపించారు. 'సిగ్గుగా లేదు, నాపై ఆరోపణలు చేయడం ఆపేయ్. నీకోసం, కూతురి కోసమైనా ఆరోపణలపై వెనక్కి తగ్గి, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ' షమీ తనకు సూచించాడని జహాన్ వివరించారు.

షమీ నుంచి తనకు హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని భార్య కోరారు. భర్తపై చేసిన ఆరోపణలకు గాను తన వద్ద అన్ని ఆధారాలున్నాయని, వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. ఒకవేశ తాను పోరాటం ఆపితే.. మహిళా వర్గం ఓడిపోయినట్లు అవుతుందన్నారు. అందుకే తాను భర్తపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని హసీన్ జహాన్ స్పష్టం చేశారు. 

తమ మధ్య మూడో వ్యక్తి ప్రవేశించి.. జహాన్‌తో ఇలా ఆడిస్తూ ఆరోపణలు చేపించారని షమీ అభిప్రాయపడ్డాడు. తన నుంచి డబ్బు రాబట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని షమీ ఆరోపిస్తున్నాడు. షమీకి నగదు ఇచ్చిందని, సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న పాకిస్తాన్ యువతి అలీష్‌బా మాత్రం క్రికెటర్‌కు తాను అభిమానిని మాత్రమేనని చెప్పారు. షమీకి తాను డబ్బు ఇవ్వలేదన్నారు. మరోవైపు షమీపై బీసీసీఐ ఏసీబీ ఇచ్చే రిపోర్ట్‌పై అతడి భవితవ్యం ఆధారపడి ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top