షమీ భార్య మరో పోస్ట్‌.. మండిపడ్డ నెటిజన్లు

Hasin Jahan Leaks Another Chat Of Mohammed Shami - Sakshi

కోల్‌కతా : టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ చాటింగ్‌ వ్యవహారాలను అతని భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో మరోసారి పోస్ట్‌ చేసారు.  ఓ అమ్మాయితో షమీ చాటింగ్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌లను తన ఫేస్‌ బుక్‌లో ‘నా భర్త ఓ స్టార్‌గా ఏ ఒక్కరిని వదల్లేదు’ అనే సెటైరిక్‌ క్యాప్షన్‌తో పంచుకున్నారు.

అయితే ఈ పోస్ట్‌పై జహాన్‌కు ఊహించని విధంగా నెటిజన్ల నుంచి విమర్శలొస్తున్నాయి.  ఇది జహాన్‌ జాత్యాహంకార దాడి అని కొదరంటే.. డబ్బుల కోసమే ఇలా చేస్తుందని మరోకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు నిరూపించాలంటే న్యాయస్థానాల్లో పోరాడాలని, కానీ సోషల్‌ మీడియా వేదికగా రచ్చ చేయడం ఏమిటని మండిపడుతున్నారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌, ఇతర మహిళలతో సంబంధాలు, హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ షమీపై సంచనల ఆరోపణలు చేస్తూ పోలీసులకు జహాన్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడు బీసీసీఐ షమీకి వార్షిక కాంట్రాక్టులో స్థానం కల్పించలేదు. అయితే దర్యాప్తు తర్వాత షమీ ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేలడంతో బీసీసీఐ ‘బి’ గ్రేడ్‌ కాంట్రాక్టులో చోటు కల్పించింది.

ఇక జహాన్‌ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కలిసారు. దాదాపు పదినిమిషాలు మహ్మద్‌ షమీ భేటీ అయిన ఆమె షమీ కేసులకు సంబంధించిన మూడు పేజీల వివరాలను సీఎంకు సమర్పించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top