షాట్‌పుట్ విజేత హసన్ హష్మి | hasan hashmi wins shot put title | Sakshi
Sakshi News home page

షాట్‌పుట్ విజేత హసన్ హష్మి

Nov 8 2016 10:57 AM | Updated on Sep 4 2017 7:33 PM

ఎఎస్‌ఐఎస్‌సీ జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో హసన్ హష్మి షాట్‌పుట్ విభాగంలో విజేతగా నిలిచాడు.

జాతీయ అథ్లెటిక్స్ మీట్  
 

సాక్షి, హైదరాబాద్: ఎఎస్‌ఐఎస్‌సీ జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో హసన్ హష్మి షాట్‌పుట్ విభాగంలో విజేతగా నిలిచాడు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో హష్మి గుండును 12.84మీ. విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. వినీత్ పవన్ (బిహార్, 12.29మీ.), రక్షత్ తోమర్ ( ఉత్తర్ ప్రదేశ్, 12.09మీ.) తర్వాత స్థానాల్ని దక్కించుకున్నారు. మరోవైపు 1500మీ. స్ప్రింట్ జూనియర్ బాలుర విభాగంలో అకాంక్షిత్, సుమిత్, రెహమాన్ తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సీనియర్ బాలుర విభాగంలో సాహెబ్ జీత్ సింగ్ తొలి స్థానాన్ని దక్కించుకోగా... గురుప్రీత్ సింగ్, అభిజిత్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement