పట్నా పైరేట్స్ రైడర్ పర్దీప్ నర్వాల్ (21 పాయింట్లు) అద్భుత ఆటతీరు కనబరిచినా... జట్టును గెలిపించలేకపోయాడు. యు ముంబా 51–41తో పైరేట్స్‌ను కంగుతినిపించింది.
సొనెపట్: పట్నా పైరేట్స్ రైడర్ పర్దీప్ నర్వాల్ (21 పాయింట్లు) అద్భుత ఆటతీరు కనబరిచినా... జట్టును గెలిపించలేకపోయాడు. యు ముంబా 51–41తో పైరేట్స్‌ను కంగుతినిపించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబా అటు రైడింగ్‌లో, ఇటు టాకిల్‌లో అదరగొట్టింది. రైడర్ కాశిలింగ్ అడకె (15), శ్రీకాంత్ జాదవ్ (13), దర్శన్ కడియన్ (8) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 38–31తో బెంగళూరు బుల్స్‌పై జయభేరి మోగించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో పుణేరి పల్టన్, తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి.