హరియాణా స్టీలర్స్‌ గెలుపు | Harryan Steelers win | Sakshi
Sakshi News home page

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

Sep 6 2017 12:50 AM | Updated on Sep 17 2017 6:26 PM

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ ఐదో విజయాన్ని సాధించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌  

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ ఐదో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 36–29తో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 11సార్లు రైడింగ్‌ వెళ్లిన వాజిర్‌ సింగ్‌ 10 పాయింట్లు స్కోర్‌ చేయగా, టాకిల్‌లో మోహిత్‌ ఛిల్లర్‌ 4 పాయింట్లు సాధించాడు. సుర్జీత్‌ సింగ్‌ 8 పాయింట్లు సాధించాడు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మనీందర్‌ సింగ్‌ 14 పాయింట్లు సాధించి ఈ మ్యాచ్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

వినోద్‌ కుమార్‌ 4 పాయింట్లు స్కోర్‌ చేశాడు. మరో మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌ 47–21తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలుపొందింది. రైడర్‌ పర్దీప్‌ నర్వాల్‌ 21 పాయింట్లతో అదరగొట్టాడు. అతను 22 సార్లు రైడింగ్‌కు వెళ్లి 21 పాయింట్లు స్కోర్‌ చేశాడు. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ తరఫున పవన్‌ కుమార్‌ 7 పాయింట్లు సాధించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement