హారిక రెండో గేమ్‌ కూడా ‘డ్రా’ | Sakshi
Sakshi News home page

హారిక రెండో గేమ్‌ కూడా ‘డ్రా’

Published Mon, Feb 13 2017 12:36 AM

హారిక రెండో గేమ్‌ కూడా ‘డ్రా’

టెహరాన్‌: ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. షమీమా (బంగ్లాదేశ్‌)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు.

ఫలితంగా సోమవారం జరిగే టైబ్రేక్‌లో నెగ్గినవారు రెండో రౌండ్‌కు అర్హత పొందుతారు. మరోవైపు భారత్‌కే చెందిన పద్మిని రెండో రౌండ్‌కు చేరింది. ఎలీనా (అర్మేనియా)తో జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న పద్మిని... రెండో గేమ్‌లో 29 ఎత్తుల్లో గెలిచి ఓవరాల్‌గా 1.5–0.5తో విజయాన్ని దక్కించుకుంది.

Advertisement
 
Advertisement