ప్రపంచకప్‌తో ఆతిథ్య దేశాలు ఖుష్! | Happy with World Cup hosts! | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌తో ఆతిథ్య దేశాలు ఖుష్!

Jul 1 2015 2:42 AM | Updated on May 29 2019 2:49 PM

ఇటీవలి వన్డే ప్రపంచకప్ నిర్వహణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ మెగా టోర్నీ

ఆసీస్, కివీస్‌లకు భారీ ఆదాయం

 దుబాయ్ : ఇటీవలి వన్డే ప్రపంచకప్ నిర్వహణ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ మెగా టోర్నీ కారణంగా రెండు దేశాల ఆర్థికాభివృద్ధిలో చెప్పుకోదగ్గ మెరుగుదల కనిపించిందని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వెల్లడించింది. ప్రపంచకప్ సందర్భంగా స్థానికంగా 1.1 బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల (దాదాపు రూ. 5,385 కోట్లు) లావాదేవీలు జరిగాయని, 8,320 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు లభించాయని ఇందులో పేర్కొన్నారు. ఈ టోర్నీ చూసేందుకు లక్షా 45 వేల మంది పర్యాటకులు రావటంతో ఈ రంగంలో ఇరు దేశాల్లో అమిత అభివృద్ధి జరిగిందని ఐసీసీ ప్రకటించింది.

ప్రపంచకప్ కారణంగా ఆస్ట్రేలియా జీడీపీ చాలా వేగంగా దూసుకుపోయిందని, పర్యాటకులు దాదాపుగా 855 మిలియన్ యూఎస్ డాలర్లను (దాదాపు రూ. 5 వేల కోట్లు) ఇక్కడ ఖర్చు చేయడం విశేషమని ఐసీసీ సీఈఓ జాన్ హార్న్‌డెన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement