
క్రికెట్ దేవుడికి శుభాకాంక్షల వెల్లువ
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. క్రికెట్ సహచరులు, అభిమానులు, ప్రపంచ సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు, వ్యాపార దిగ్గజాలు తదితరుల విషెస్తో ట్విట్టర్ పులకించి పోయింది.
ముంబయి: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు ట్విట్టర్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. క్రికెట్ సహచరులు, అభిమానులు, ప్రపంచ సెలబ్రిటీలు, బాలీవుడ్ నటులు, వ్యాపార దిగ్గజాలు తదితరుల విషెస్తో ట్విట్టర్ పులకించి పోయింది. ఆదివారం మాస్టర్ బ్లాస్టర్కు పలువురు 43వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్కు సచిన్ టెండూల్కర్ గుడ్బై చెప్పి దాదాపు మూడేళ్లు గడిచినా ఆయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి తెలిసింది.
ఆయన రిటైర్మంట్ ప్రకటించిన రోజు ఇచ్చిన సందేశాత్మక ప్రసంగంలో క్రికెట్ అభిమానులకే కాకుండా ప్రతిఒక్కరినీ కట్టిపడేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 'పుట్టిన రోజు శుభాకాంక్షలు సచిన్.. నీవు మా అందరిని గర్వపడేలా చేశావు' అంటూ ట్వీట్ చేశాడు. ఇక 'క్రికెట్ దేవుడు సచిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. దేశానికి అసలైన హీరో.. రియల్ జెమ్ నువ్వే' అంటూ యువరాజ్ ట్వీట్ చేశాడు. వీరితోపాటు సురేశ్ రైనా, శిఖర్ ధవన్, అనిల్ కుంబ్లే, అనురాగ్ ఠాకూర్, మహ్మద్ కైఫ్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రతుల్ పటేల్ తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
T 2235 - Happy birthday Sachin .. you make us so proud .. pic.twitter.com/7F97tlSXyf
— Amitabh Bachchan (@SrBachchan) 23 April 2016
Many happy returns of the day to god of cricket a humble man and a true gem ! The hero of our nation @sachin_rt God bless you master !