హామిల్టన్‌కు 50వ ‘పోల్’ | Hamilton in 50 'pole' | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌కు 50వ ‘పోల్’

Mar 20 2016 1:43 AM | Updated on Aug 21 2018 9:00 PM

హామిల్టన్‌కు 50వ ‘పోల్’ - Sakshi

హామిల్టన్‌కు 50వ ‘పోల్’

డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ కొత్త సీజన్‌ను దూకుడుతో ప్రారంభించాడు.

 నేడు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి

మెల్‌బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ కొత్త సీజన్‌ను దూకుడుతో ప్రారంభించాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 23.837 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 50వ ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు  పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా 9వ, 10వ స్థానాల నుంచి రేసు మొదలుపెడతారు.

నేటి ప్రధాన రేసు
ఉదయం గం. 10.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement