గ్రీన్‌లాండ్స్ విజయం | green lands beats imperial cc | Sakshi
Sakshi News home page

గ్రీన్‌లాండ్స్ విజయం

Oct 25 2016 10:57 AM | Updated on Sep 4 2017 6:17 PM

బ్యాట్స్‌మన్ సుధీంద్ర (95 నాటౌట్)తో పాటు బౌలర్ నిఖిల్ (7/36) రాణించడంతో గ్రీన్‌లాండ్స్ జట్టు విజయం సాధించింది.

సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మన్ సుధీంద్ర (95 నాటౌట్)తో పాటు బౌలర్ నిఖిల్ (7/36) రాణించడంతో గ్రీన్‌లాండ్స్ జట్టు విజయం సాధించింది. ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా ఇంపీరియల్ సీసీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంపీరియల్ సీసీ జట్టు 30.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. అనంతరం గ్రీన్‌లాండ్‌‌స జట్టు 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 121 పరుగులు చేసి గెలిచింది. సుధీంద్ర దూకుడుగా ఆడి ఆకట్టుకున్నాడు.

 ఇతర మ్యాచ్‌ల వివరాలు

 హైదరాబాద్ పేట్రియాట్స్: 267 (శైలేష్ 49; అరుణ్ 3/62), మయూర్: 69/9 (మహేశ్ 5/21).
 హెచ్‌సీఏ అకాడమీ: 406 (శ్రీనివాస్ 151; శశికుమార్ 5/121), సెయింట్ ప్యాట్రిక్స్: 181 (సాహిల్ 42; శివకోఠి 5/40).
 రాయల్ సీసీ: 207 (రవి శంకర్ 40; అమృత్ 3/18), సెయింట్ సాయి: 107 (హూస్టన్ 41; రాఘవ 4/28).
 తిరుమల: 209 (శ్రీకాంత్ 42, నవీన్ 76; బషీరుద్దీన్ 4/32, షరీఫ్ 3/14), బాయ్స్ టౌన్: 201 (బషీరుద్దీన్ 75; ధనంజయ్ 5/36).  
 యంగ్ సిటిజన్: 154 (అస్లమ్ 71; అభిజిత్ 5/38, హిమాన్షు 5/6); నోబెల్: 157/8 (అనిరుధ్ 59, షంశుద్దీన్ 54; సాయి సృతీశ్ 7/21).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement