హరికృష్ణకు ఆరో స్థానం | Grandmaster pentelaHarikrishna in the sixth place | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు ఆరో స్థానం

Jun 5 2016 12:30 AM | Updated on Sep 4 2017 1:40 AM

షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

న్యూఢిల్లీ: షామ్‌కిర్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అజర్‌బైజాన్‌లో శనివారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.

చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హరికృష్ణ 62 ఎత్తుల్లో ఎల్తాజ్ సఫార్లి (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయాడు. మొత్తం తొమ్మిది గేముల్లో హరికృష్ణ రెండింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement