వైఎస్‌ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్‌ రాహుల్‌ | Gold Winner Ragala Venkata Rahul Meets YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్‌ రాహుల్‌

Apr 23 2018 4:01 AM | Updated on Aug 27 2018 8:57 PM

Gold Winner Ragala Venkata Rahul Meets YS Jagan Mohan Reddy - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్‌ రాహుల్‌ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న
వైఎస్‌ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్‌ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్‌ తెలిపారు. 

భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్‌ రాహుల్‌  గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement