
ధోని రికార్డు బద్దలు కొట్టిన గంభీర్
ఐపీఎల్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ రికార్డుల వేట కొనసాగుతోంది.
కోల్‌కతా: ఐపీఎల్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ రికార్డుల వేట కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా మరో ఘనత సాధించాడు. ఒక ఫ్రాంచైజీ తరపున కెప్టెన్‌గా ఆడుతూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు ఎంఎస్ ధోని(2986) పేరిట ఉన్న రికార్డును గౌతీ సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో గంభీర్ 21 పరుగులు చేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా 3 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గంభీర్(4088) నాలుగో స్థానంలో ఉన్నాడు. సురేశ్ రైనా 4540 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి(4360), రోహిత్ శర్మ(4156) రెండు మూడు స్థానాల్లో ఉన్నారు. 3977 పరుగులతో డేవిడ్ వార్నర్ ఐదో స్థానంలో నిలిచాడు.