
కోహ్లితో గంభీర్ ఇలా..
న్యూజిలాండ్తో ఈడెన్ గార్డెన్లో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు నేపథ్యంలో వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు.
కోల్ కతా: న్యూజిలాండ్తో ఈడెన్ గార్డెన్లో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు నేపథ్యంలో వెటరన్ ఆటగాడు గౌతం గంభీర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయపడటంతో అతని స్థానంలో భారత జట్టులో గంభీర్ ను ఎంపిక చేశారు. దీనిలో భాగంగా గురువారం గంభీర్ ప్రాక్టీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి సరదాగా గడిపాడు.
గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య రెండు సార్లు మాటల యుద్ధం జరగడంతో అసలు వీరు ఫీల్డ్లో ఎలా ఉంటారనే దానిపై తొలుత ఆసక్తి ఏర్పడింది. అయితే దానికి భిన్నంగా వీరిద్దరూ నవ్వుకుంటూ కనిపించడంతో గతం గతః అని అనుకోవడం అభిమానుల వంతైంది. ఈ మేరకు వీరిద్దరూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పోస్ట్ చేసింది.
ఢిల్లీ రంజీ జట్టు సన్నాహక శిబిరంలో ఉన్న గంభీర్ హడావిడిగా మంగళవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి వెళ్లి ఫిట్‌నెస్ టెస్టులో పాసయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉన్నా... ముందు జాగ్రత్తగా గంభీర్‌ను పిలిచారు. దీనిలో భాగంగా కోహ్లి, వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహాతో కలిసి గంభీర్ ప్రాక్టీస్లో పాల్గొన్నాడు.
#TeamIndia skipper @imVkohli sharing a laugh with @GautamGambhir & @Wriddhipops during the training session - @Paytm Test Cricket #INDvNZ pic.twitter.com/vtUDpgwfaV
— BCCI (@BCCI) 29 September 2016